అమరావతి: ఓ మహిళా ఎస్‌ఐపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ప్రొద్దుటూరులో పెన్నా నది నుంచి అక్రమ ఇసుక రవాణా సాగుతోందని సమాచారం రావడంతో హైమావతి అనే మహిళా ఎస్‌ఐ తన కానిస్టేబుల్‌తో రామేశ్వరం బైపాస్ రోడ్డుకు చేరుకున్నారు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా ఆపేందుకు ప్రయత్నించగా వారు తప్పించుకొని పారిపోయారు. బైక్‌పై ఇద్దరు వచ్చి ఆమెపై రాళ్లతో దాడి చేసి పారిపోయారు. ఎస్‌పి సిద్ధార్థ్ కౌశల్‌కు సదరు ఎస్‌ఐ సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐపై దాడి చేసిన వారు అక్రమ ఇసుక రవాణా చేసిన వారే కావొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఎస్‌ఐ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్‌ఐని రాళ్లతో కొట్టి….
- Advertisement -
- Advertisement -
- Advertisement -