Monday, December 23, 2024

భూ కబ్జా.. గిరిజన మహిళకు నిప్పు

- Advertisement -
- Advertisement -

గుణా: మధ్యప్రదేశ్‌లో ఓ భూ వివాదానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులు గిరిజన మహిళ రాంప్యారీ భాయి(45)పై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ దారుణ ఘటన రెండు రోజుల క్రితం ధనోరియా గ్రామంలో మిట్టమధ్యాహ్నం జరిగింది. ఒళ్లంతా బాగా కాలిన దశలో ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగానే ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ ఇద్దరు మహిళలతో పాటు మొత్తం ఐదుగురిని అరెస్టు చేశారని పోలీసు వర్గాలు వివరించాయి. భోపాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రాంప్యారీకి చికిత్స జరుగుతోంది. మహిళను సజీవ దహనం చేసేందుకు యత్నించిన వ్యక్తి ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో కావాలనే చిత్రీకరించినట్లు స్పష్టం అయిందని స్థానిక పోలీసు అధికారి యువరాజ్ సింగ్ తెలిపారు.

ఒళ్లు కాలి మంటలు దట్టమైన పొగల మధ్య దళిత మహిళ బాధతో చావుకేకలు పెడుతూ ఉంటే దుండగులు అరుస్తూ ఉండటం, వారిలో ఒకరు వీడియో తీయరా అంటూ పురమాయించడం వెలుగులోకి వచ్చింది. తాను తన వ్యవసాయ పొలం వద్దకు వచ్చేసరికి భార్య ఒళ్లంతా కాలి పడి ఉందని భర్త అర్జున్ సహారియా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. తన భూమిని స్థానిక వ్యక్తి బలవంతంగా కబ్జా చేశాడని, తరువాత తాను అధికారుల వద్దకు వెళ్లగా ఈ ఏడాది మే నెలలోనే తన భూమి తనకు దక్కిందని, దీనితో ఈ వ్యక్తి తనపై కక్ష పెంచుకున్నాడని అర్జున్ తెలియచేసుకున్నాడు. అప్పుడు భూమి పోయింది. ఇప్పుడు భార్య పొయ్యేలా ఉందని వాపోతున్నాడు.

Attack on Tribal Woman over Land Issue in MP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News