Monday, December 23, 2024

ఎర్ర సముద్రంలో మరో రెండు నౌకలపై దాడి

- Advertisement -
- Advertisement -

ఒక నౌకలో 25మంది భారతీయులు

న్యూఢిల్లీ: ఎర్ర సముద్రంలో శనివారం మరో రెండు నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. 25 మంది భారతీయులున్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి చేసినట్లు భారత నౌకాదళం తెలిపింది. అయితే ఇండియన్ జెండా లేని నౌకపైనే దాడి చేసినట్లు స్పష్టం చేసింది. గాబన్ జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంవి సాయిబాబా’ అనే నౌకపై దాడిచేశారని తెలిపింది. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపింది. మరోవైపు నార్వేజియన్ జెండా కలిగిన మరో ఆయిల్ ట్యాంకర్‌పై కూడా హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు.

అయితే భారతీయ జెండా కలిగిన నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారని అమెరికా ఇంటెలిజన్స్ అంతకు ముందు పొరపాటున తెలిపింది. కానీ అలాంటిదేమీ లేదని భారత నౌకాదళం ఆ తర్వాత తెలిపింది.ఆయిల్ ట్యాంకర్ ‘ఎంవి సాయిబాబా’పై దాడి జరిగినట్లు స్పష్టం చేసింది. అలాగే అమెరికా యుద్ధ నౌక యుఎస్‌ఎస్ లబూన్‌పైన కూడా డ్రోన్ దాడులకు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ డ్రోన్లను యుద్ధ నౌక కూల్చివేసినట్లు అమెరికా సెంట్‌కామ్ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News