Wednesday, January 22, 2025

కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి.. ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Attack on Union Minister Satya Pal Singh in UP

లక్నో(యూపి): యూపీలోని మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్‌లో కేంద్రమంత్రి, బిజెపి నేత సత్యపాల్ సింగ్ బఘేల్ కాన్వాయ్‌పై దుండగులు రాళ్లతో మంగళవారం రాత్రి దాడి చేశారు. దీనిపై మంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్‌కు జెడ్ కేటగిరి భద్రతను కల్పించినట్టు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వర్గాలు బుధవారం తెలిపాయి. ఈ దాడిపై బఘెల్ కర్హల్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగం లోకి దిగి ఇద్దరిని అరెస్టు చేశారు. కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి సత్యపాల్ సింగ్ బఘేల్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో దిగారు. సత్యపాల్‌పై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బఘేల్ కాన్వాయ్ లోని ఓ వాహనం అద్దాలు పగిలిపోయాయి. బఘెల్ ఇంతవరకు వై ప్లస్ భద్రతా కేటగిరిలో ఉన్నారు.

Attack on Union Minister Satya Pal Singh in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News