అమరావతి: వాహనంపై ఉన్న పన్ను కట్టమన్నందుకు రవాణాశాఖ అధికారిపై కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో జరిగింది. అధికారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కాకినాడలో ఎం చిన్నారావు అనే వ్యక్తి వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. కాకినాడలో దేవాదాయ శాఖ కార్యలయం సమీపంలో వ్యాన్‌పై పెంట వెంకట్ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి కొబ్బరి బొండాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. వ్యాన్‌పై జరిమానాలు ఉండడంతో వెహికల్ ఇన్‌స్పెక్టర్ చిన్నారావు ఫైన్ కట్టాలని దుర్గా ప్రసాద్‌కు తెలిపాడు. ఇప్పటికే చాలా ఫైన్లు కట్టానని ఇప్పడు కట్టేదే లేదని దుర్గాప్రసాద్ ఖరాఖండిగా చెప్పాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. కోపంతో ఊగిపోయిన దుర్గా ప్రసాద్ కత్తి తీసుకొని విచక్షణారహితంగా చిన్నారావుపై దాడి చేశాడు. ప్రత్యక్ష సాక్షులు అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికి వారిపైకి కత్తి తీసుకొని దాడి చేస్తుండడంతో వారు అక్కడి నుంచి తప్పించుకున్నారు. తీవ్రంగా గాయపడిన చిన్నారావును ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఫైన్ కట్టమన్నందుకు.. వెహికల్ ఇన్‌స్పెక్టర్‌పై కొబ్బరి బొండాల కత్తితో దాడి… పరిస్థితి విషమం
- Advertisement -
- Advertisement -
- Advertisement -