Monday, January 20, 2025

వైన్ షాపులపై దాడి… లూటీ చేసిన మహిళలు

- Advertisement -
- Advertisement -

అధిక ధరలకు అమ్ముతున్నారని 4 వైన్‌ షాపులపై దాడి చేసి లూటీ చేసిన మహిళలు

ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిలో పేరొందిన బ్రాండ్లు అందుబాటులో లేకుండా కేవలం బెల్ట్ షాపులో అమ్ముతున్నారని స్థానికులు దాడికి తెగపడ్డారు. ఒక్కో బాటిల్‌పై 20 నుంచి 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని ఒకేసారి 4 వైన్‌ షాపులపై దాడి చేశారు. మద్యం స్టాక్ ను మహిళలు, గ్రామస్తులు ఎత్తుకెళ్లారు. షాపు నిర్వహకుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News