Wednesday, January 29, 2025

బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హనుమకొండ జిల్లా బీమదేవరపల్లి మండలం వంగరలో ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపి బండి సంజయ్ కుమార్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేశారు. కోడిగుడ్ల దాడిపై బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలో దాడి జరిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తనకు భద్రత అక్కర్లేదని, పోలీసులు వెళ్లిపోవాలని బండి సంజయ్ సూచించారు. తన రక్షణ సంగతి బిజెపి కార్యకర్తలే చూసుకుంటారని దుయ్యబట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వ్యతిరేకంగా బిజెపి కార్యకర్తలు నినాదాలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బిజెపి నేతలు ప్రజాహిత యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి-కాంగ్రెస్ నాయకులు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి పలుచోట్ల బలమైన ఎంపి అభ్యర్థులను పోటీ చేయించడానికి కసరత్తు చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News