Wednesday, March 26, 2025

మాసబ్‌ట్యాంక్‌లో బాలీవుడ్ నటిపై దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వ్యభిచారం చేయాలని బాలీవుడ్ నటిపై దాడి చేసిన సంఘటన హైదరాబాద్‌లోని మసాబ్‌ట్యాంక్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముంబయిలో ఉంటున్న బాలీవుడ్‌లో ఓ యువతి టివి నటిగా నటిస్తుంది. ఆమెకు హైదరాబాద్‌లో స్నేహితురాలు ఉండడంతో తమ షాప్ ఓపెనింగ్ చేయాలని కోరింది. ఆమెకు కావాల్సిన విమానఛార్జీలు, పారితోషికం చెల్లిస్తామని వెల్లడించింది. 18న హైదరాబాద్ చేరుకొని మాసబ్‌ట్యాంక్‌లోని శ్యామ్‌నగర్‌లో ఓ ఆపార్ట్‌మెంట్‌లో బస చేశారు. ఓ వృద్ధురాలు ఆమె అను సదుపాయాలు కల్పించింది.

21 రాత్రి యువతి ఉంటున్న ఇంట్లోకి ముగ్గురు చొరబడి తమతో వ్యభిచారం చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ఎదురుతిరగడంతో ఆమెపై ముగ్గురు దాడి చేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో ముగ్గురు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ఇద్దరు మహిళలు, వృద్ధురాలు ఆమెను ఇంట్లో బంధించి యాబై వేల నగదులో పారిపోయారు. నటి 100కు డయల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను రక్షించారు. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News