Monday, November 18, 2024

బంగారం కల్తీ చేస్తున్నారని దాడి

- Advertisement -
- Advertisement -

Attacked on jewelry shop owner in charminar

=వర్కర్లపై దాడి చేసిన యజమాని
=పశ్బిమబెంగాల్‌కు చెందిన వర్కర్లు
=పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
=ముగ్గురి అరెస్టు, పరారీలో ప్రధాన నిందితుడు

హైదరాబాద్: బంగారు ఆభరణాల తయారీలో కల్తీ చేస్తున్నారని ఆగ్రహంతో యజమాని వర్కర్లపై దాడి చేసిన సంఘటన నగరంలోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రదీప్ జాను బతుకు దె రువు కోసం నగరానికి వచ్చాడు. ఘన్సీబజార్‌లో ఉంటూ బంగారు ఆభరణాల షో రూంల నంపచి ఆభరణాలు తయారు చేసే ఆర్డడ్ తీసుకుని వర్కర్లను నియమించుకుని వారితో తయారు చేయిస్తున్నాడు. బంగారు ఆభరణాలు తయారు చేసేందుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన లక్ష్మికాంత్, సిమ్రాన్ మున్నా, ఉదయ్ సాంత్ర పనిచేస్తున్నారు. గత ఏడేళ్ల నుంచి వీరు ప్రదీప్ వద్ద బంగారు ఆభరణాలు తయారు చేసే పనిచేస్తున్నారు. ఈ క్ర మంలోనే ఇటీవలి కాలంలో ప్రదీప్ కొన్ని బంగారు ఆభరణాలు తయారు చేయాల్సిందిగా 9.16 స్వచ్ఛత కలిగిన బంగారాన్ని ఇచ్చాడు.

వాటిని తీసుకున్న ముగ్గురు వారం రోజుల తర్వాత ఆభరణాలు తయారు చేసి ఇచ్చారు. వాటిని తీసుకున్న ప్రదీప్ వాటిలో స్వచ్ఛత లోపించిందని ఆరోపిస్తూ తన అనుచరులు రాజు, బాబులాల్, లాల్ట, సుజాన్‌తో కలిసి లక్ష్మికాంత్, ఉదయ్ సాంత్ర, సి మ్రాన్‌ను సిలిండర్‌కు కట్టేసి తీవ్రంగా దాడి చేశారు. వారి వద్ద ఉన్న 12తులాల బంగారంతో పాటు రూ.55,000 తీసుకున్నారు. మరింత బంగారం ఇవ్వాలని ము గ్గురిపై దాడి చేశారు. ముగ్గురిపై తీవ్రంగా కొట్టడంతో వర్కర్లు స్పృహ కోల్పోయారు. కొద్ది సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితులు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన రాజు, బాబులాల్, లాల్ట, సుజాన్‌ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ప్రదీప్ పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, వారిపై ఐపిసి సెక్షన్ 342కింద కేసులు నమోదు చేశామని ఇన్స్‌స్పెక్టర్ గురు నాయుడు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News