Wednesday, January 22, 2025

పాక్‌లో బొగ్గు గనిపై తీవ్రవాదుల దాడి..20 మంది కార్మికుల మృతి

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ ప్రావిన్సులో శుక్రవారం ఒక ప్రైవేట్ బొగ్గు గనిపై తీవ్రవాదులు రాకెట్ చాంచర్లు, ఆటోమేటిక్ ఆయుధాలతో జరిపిన దాడిలో నలుగురు అఫ్ఘానిస్తాన్ పౌరులతోసహా 20 మంది కార్మికులు మరణించారు. మరో 8 మంది కార్మికులు గాయపడ్డారు. దుక్కి ప్రాంతంలోని జునాయిడ్ బొగ్గు కంపెనీపై కొందరు సాయుధ తీవ్రవాదులు డి చేసి, అనంతరం పర్వతాల వైపు పారిపోయారని బలోచ్ ఎస్‌ఎస్‌పి మొహమ్మద్ తెలిపారు. వచ్చే వారం దేశ రాజధానిలో షాంఘై సహకార సంస్థ సదస్సు జరగనున్న నేపథ్యంలో వరుసగా జరుగుతున్న తీవ్రవాదుల దాడుల పరంపరలో భాగంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటన జరిగిన సమయంలో దాదాపు 50 మంది కార్మికులు గనిలో పనిచేస్తున్నారు. కొందరు పర్వతాల వైపు పారిపోయి, మరి కొందరు గనులలోపల దాక్కుని కాల్పుల దాడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు చెప్పారు. వీరిలో కొందరు అఫ్ఘానిస్తాన్‌కు చెందిన పౌరులు ఉన్నారని వారు చెప్పారు. ఈ ప్రాంతంలో దాదాపు 10 బొగ్గు గనులు ఉన్నాయి. తీవ్రవాదులు చేతి గ్రెనేడ్లు, రాకెట్ లాంచర్లను ఉపయోగించారని పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News