Wednesday, January 22, 2025

ప్రేమ వ్యవహారంలో వ్యక్తిపై కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

Attacking a person with a knife in a love affair

దాడి చేసిన వ్యక్తితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు

పరిగి : ప్రేమ వ్యవహారంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి హాత్యయత్నానికి పాల్పడిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుంది. పరిగి పోలీస్‌లు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం వివరాలీలా ఉన్నాయి. పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లెమోనిగూడకు చెందిన కరీం కూతురుని గత మూడు రోజుల క్రితం ఎర్రగడ్డపల్లికి చెందిన సల్మాన్ ప్రేమిస్తున్నాని తీసుకవెళ్లాడు. అప్పుడే పరిగి పిఎస్‌లో కేసు నమోదైంది. ఈ విషయంపై ఎస్‌ఐ విఠల్‌రెడ్డి వారిపై నిఘా పెట్టి సమాచారాన్ని తెలుసుకున్నారు. దీంతో వారు ఇద్దరు ఆగ్రాలో ఉన్నట్లు తెలుసుకున్న ఎస్‌ఐ అక్కడికి వెళ్లి వారిని తీసుకవస్తున్నారు.

ఇది తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. కాగా ఈ వ్యవహారంలో ఆదివారం సల్మాన్ అన్న అయిన శిరాజ్ పై పోలీస్ స్టేషన్ సమీపంలో అమ్మాయి తండ్రి కరీం అనే వ్యక్తి మరో నలుగురితో కలిసి కత్తిలో దాడి చేసి పరారయ్యాడు. దీంతో శిరాజ్ పోలీస్ స్టేషన్‌లోకి పరుగెత్తి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. పొట్టలో కత్తిపోట్లు బలంగా తాకడం వల్ల పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసి శిరాజ్‌ను మెరుగైన వెద్యం కోసం నగరానికి తరలించారు. ఎర్రగడ్డపల్లి గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి, పోలీస్ స్టేషన్‌కు తరలి వచ్చి ఆందోళన చేశారు. ఈ మేరకు దాడి చేసిన కరీంతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News