Friday, December 20, 2024

దళిత స్పీకర్‌పై దాడికి యత్నించడం బాధాకరం: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శాసన సభలో దళిత స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ పై బిఆర్ఎస్ ఎంఎల్ఎలు దాడికి యత్నించడం బాధాకరమైన విషయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభలో దౌర్జన్యం, రౌడీయిజం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. శాసన సభలో భూభారతి బిల్లుపై చర్చను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొనసాగించారు. రైతులకు భరోసా కల్పించేందుకు భూభారతి చట్టం తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణం నిజాం కాలంనాటి భూసమస్యలు అని వివరించారు. నిజాం కాలంలో దళిత, గిరిజన, బిసిల భూములను అగ్రకులాలకు చెందిన వారు లాక్కున్నారన్నారని గుర్తు చేశారు. అసెంబ్లీలో జరిగిన ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో రేవంత్ మాట్లాడారు. ఫార్ములా ఈ కార్ రేసుపై చర్చించాలని బిఆర్‌ఎస్ ఆందోళన చేపట్టడంతో శాసన సభలో గందరగోళం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News