Wednesday, January 22, 2025

పాత కక్షలతో వ్యక్తిపై గొడ్డలితో దాడి..

- Advertisement -
- Advertisement -

కొడంగల్‌ః వ్యక్తిపై గొడ్డళితో దాడి చేయగా తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి మండల పరిధిలోని పాటిమిదిపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రవిగౌడ్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోసగాళ్ళ ఆశోక్‌పై అదే గ్రామానికి చెందిన హస్నాబాద్ శ్రీనివాస్, పోసగాళ్ళ నర్సిములులు గోడ్డలి, కట్టెలతో దాడి చేశారు.

పాత కక్షల నేపథ్యంలోనే దాడికి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. ఆశోక్ భార్య సావిత్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా తీవ్రంగా గాయపడిన ఆశోక్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News