Wednesday, January 22, 2025

ఎక్సైజ్ అధికారుల ముప్పేట దాడులు

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలోని పోలిశెట్టిపల్లి తాండ వద్ద ఎక్పైజ్ అధికారులు శనివారం రూట్ వాష్‌లో భాగంగా ముప్పేట దాడులు నిర్వహిస్తూ బైక్‌పై అక్రమంగా తరలిస్తున్న పది లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని పోలిశెట్టిపల్లి తండాకు చెందిన సేవ్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని ఎక్సైజ్ ఎస్సై బాలరాజ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత నల్లబెల్లం, సారాయి కొన్నా, అమ్మినా కఠినపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మొదటిసారి బైండోవర్ చేయడం జరుగుతుందని, అదే క్రమంలో పట్టుబడితో పిడి యాక్డ్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్సై సతీష్ కుమార్, సిబ్బంది నవీన్, పర్వతాలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News