Monday, December 23, 2024

ఉత్తర ఇరాక్, సిరియాల్లో దాడులు జరిపాం: ఇరాన్ ప్రకటన

- Advertisement -
- Advertisement -

ఆ ప్రాంతంలో పెరిగిన ఉద్రిక్తతలు
నలుగురు పౌరుల మృతి, ఆరుగురికి గాయాలు
కుర్దిష్ భద్రత మండలి వెల్లడి

ఇర్బిల్ (ఇరాక్) : ఇరాక్‌లోని పాక్షిక స్వయంపాలక కుర్దిష్ ప్రాంతం కేంద్రమైన ఇర్బిల్‌లో యుఎస్ కాన్సులేట్ సమీపాన ఒక ప్రాంతాన్ని క్షిపణులు దెబ్బ తీసిన కొద్ది సేపటికే ‘వేగుల ప్రధాన కేంద్రం, ఇరాన్ వ్యతిరేక ఉగ్ర మూకల సమూహం’పై తాము దాడులు ప్రారంభించినట్లు ఇరాన్ సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ప్రకటించింది.

ఆ దాడుల్లో నలుగురు పౌరులు హతులైనట్లు, మరి ఆరుగురు గాయపడినట్లు కుర్దిష్ ప్రాంతీయ ప్రభుత్వ భద్రత మండలి ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇరాకీ మాజీ ఎంపి మషాన్ అల్- జబౌరి ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ ప్రకారం, వాటిలో ఒక దాడిలో ప్రముఖ స్థానిక వాణిజ్యవేత్త పెష్రా దిజాయి తన కుటుంబ సభ్యులతో పాటు మరణించాడు. ఒక క్షిపణి ‘నా ఇంటి పక్కనే ఉన్న భవనం’ దిజాయి ఇంటిపై పడిందని, ‘ఆ భవనం సలాహ్ అల్=దిన్ రిసార్ట్ రోడ్డులో నిర్మాణంలో ఉన్నద’ని మషాన్ తెలిపారు.

సిరియాలో ఇస్లామిక్ స్టేట్ లక్షాలతో సహా ‘ఉగ్ర మూకల కార్యకలాపాల’పై తాము దాడి జరిపినట్లు, ‘బాలిస్టిక్ క్షిపణులు కొన్నిటిని పంపి వాటిని ధ్వంసం’ చేసినట్లు ఆ వెంటనే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌లు ప్రభుత్వ మీడియా ద్వారా ప్రకటించారు. ఇరాక్ కుర్దిష్ ప్రాంతంలో ఇజ్రాయెల్ వేగుల సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయంపై తాము క్షిపణి దాడి జరిపినట్లు వారు మరొక ప్రకటనలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News