Friday, November 15, 2024

దళిత యువతిని వివస్త్రను చేసి..కారంపొడి చల్లి..

- Advertisement -
- Advertisement -

మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలం, అక్కాపూర్‌లో సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ఓ అవమానవీయ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బయటకు వచ్చింది. పలువురు గ్రామస్థుల ద్వారా తెలిసిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా, గంబీరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత యువతి చేపియాలా స్రవంతి కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలం, అక్కాపూర్ గ్రామానికి సంధాని నరేష్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ గతంలో పెళ్లిళ్లు జరుగగా ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. కామారెడ్డిలోని ఒక ప్రవేటు రైస్ మిల్లులో కూలీ పనిచేసుకుంటూ సహజీవనం చేస్తున్నారు. అక్కాపూర్ గ్రామానికి చెందిన నరేష్ గతంలో సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకోగా ఒక కుమారుడు కూడా ఉన్నాడు. నరేష్ రెండో పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న అతని మొదటి భార్య సంధ్య బంధువులు, కుల పెద్దలు కలిసి నరేష్,

స్రవంతితో నివాసముంటున్న చోటికి వెళ్లి వారిపై దాడి చేసి స్రవంతిని వివస్త్రను చేసి కారంపొడి చల్లి, దారుణంగా దాడిచేసి గాయపరిచారు. అనంతరం ఇద్దరినీ అక్కాపూర్ గ్రామానికి తీసుకువచ్చి గ్రామ ప్రధాన కూడలి వద్ద బంధించి రాత్రంతా కర్రలతో భౌతిక హింసకు పాల్పడ్డారు. దాడిలో గాయపడిన నరేష్, స్రవంతి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించేదని సమాచారం. కుల పెద్దలు దాడి చేసిన వారి నుంచి కొంత అడ్వాన్సు తీసుకుని బాధితుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండిపోయారని తెలిసింది. దాడిలో గాయపడి స్పృహ తప్పిపోయిన ఇద్దరినీ అక్కడే వదిలేసి, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపే స్తామంటూ బెదిరించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ కావడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటనపై పలువురు మండిపడుతున్నారు. బాధితులకు న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News