Sunday, December 22, 2024

హిందువులపై దాడి అనాగరికం: ట్రంప్

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులపై జరిగిన దాడిని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్‌తో అమెరికా సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తానని పేర్కొన్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ మేరకు ఓ పోస్టు చేశారు. ఈ సందర్భంగా హిందువులకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌లు అమెరికాతోపాటు, ప్రచంలోని హిందువులను పట్టించుకోలేదని విమర్శించారు. ‘బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీలపై జరిగిన అనాగరిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అల్లరి మూకలు హిందువుల ఇళ్లు, దుకాణాలను లూటీ చేశారు. దీంతో ఆ దేశంలో తీవ్రమైన భయానక గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.

నా సమయంలో ఎప్పుడూ ఇలాంటిది జరగలేదు. అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా , బైడెన్‌లు విస్మరించారు. ఇజ్రాయెల్ నుంచి మొదలుకొని, ఉక్రెయిన్, అమెరికా దక్షిణ సరిహద్దు వరకు విపత్తులు ఎన్నో ఉన్నాయి. మేం అధికారంలోకి వస్తే మళ్లీ అమెరికాను బలంగా తయారుచేసి శాంతిని నెలకొల్పుతాం. రాడికల్ లెఫ్‌ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరే ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తాం. హిందువుల స్వేచ్ఛ కోసం పోరాడుతాం. నా పరిపాలనలో ఇండియాతోపాటు నా స్నేహితుడు, ప్రధాని మోడీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటాం. కమలా హారిస్ గెలిస్తే అధిక పన్నులు, కఠినమైన నిబంధనలతో మీ చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తుంది. నేను గెలిస్తే పన్నులు, నిబంధనల్లో కోత విధిస్తా. అమెరికాను చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మిస్తా అని ట్రంప్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News