Monday, December 23, 2024

ఆన్‌లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్‌పై దాడులు

- Advertisement -
- Advertisement -

ఎడిటర్ ఇన్ చీఫ్ అరెస్టు

30 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు
పలువురు జర్నలిస్టుల నివాసాలలో తనిఖీలు

ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం

న్యూస్‌క్లిక్ ఆఫీస్ సీజ్

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ న్యూస్‌పోర్టల్‌కు చైనానుంచి నిధులు అందుతున్నాయన్నాయంటూ ఇటీవలే వచ్చిన ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా మంగళవారం స్థానికంగా ఉన్న న్యూస్ క్లిక్ కార్యాలయంతో పా టుగా దానిలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ సహా దాదాపు 30 ప్రదేశాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టి పె ద్ద ఎత్తున ల్యాప్‌ట్యాప్‌లు,మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.అంతేకాకుండా న్యూస్‌క్లిక్ కార్యాలయానికి సీ ల్ వేశారు. ఈ సోదాల సందర్భంగా ఎవరినీ అరెస్టు చే యలేదని పోలీసులు తెలిపారు. న్యూస్‌పోర్టల్ వ్యవస్థాపకు డు, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థను దక్షిణ ఢిల్లీలోని పోర్టల్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఫోరెన్సిక్ బృందం కూడా ఉండింది. పో లీసులు ప్రశ్నించిన జర్నలిస్టుల్లో ఊర్మిలేష్, అనింద్యో చక్రవర్తి, అభిషార్ శర్మ, పరంజయ్ గుహ థాకుర్త, చరిత్ర కారుడు సోహైల్ హాష్మి ఉన్నారు. విదేశీ ప్రయాణాలు, ఢిల్లీలోని షహీన్‌బాగ్‌వద్ద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, రైతుల ఆందోళనలతో పాటుగా వివిధ అంశాలకు సంబంధించి 25 ప్రశ్నలను పోలీసులు జర్నలిస్టులను ప్రశ్నించారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కార్యాలయంలోనూ సోదాలు జరిగాయి. సిపిఎం ఉద్యోగి శ్రీనారాయణ్ కుమారుడు న్యూస్‌క్లిక్‌లో పని చేస్తున్నారు. అయితే సిపి ఎం కార్యాలయాన్ని ఏచూరికి కేటాయించారు. ఈ దాడులపై ఏచూరి స్పందించారు. పోలీసులు తన నివాసానికి వచారని, అక్కడ తనతో పాటుగా నివసిస్తున్న సహచరుడి కుమారుడు న్యూస్‌క్లిక్‌లో పని చేస్తున్నాడని తెలిపారు. అతడిని విచారించేందుకు పోలీసులు వచ్చారని ఆయన తెలిపారు.
ఎడిటర్స్ గిల్డ్ , జర్నలిస్టుల సంఘాల ఖండన
కాగా న్యూస్‌లింక్ కార్యాలయం, దానిలో పనిచేసే జర్నలిస్టుల కార్యాలయాలపై ఢిల్లీ పోలీసులు దాడులు చేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సహా వివిధ జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పత్రికా స్వేచ్ఛను అణగదొక్కే చర్యగా ఈ దాడులను ఆ సంఘాలు పేర్కొన్నాయి. మంగళవారం తెల్లవారుజామున కొంతమంది సీనియర్ జర్నలిస్టుల నివాసాలపై జరిగిన దాడుల నట్ల తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దాడులు పత్రి కా స్వేచ్ఛ గొంతునొక్కే మరో ప్రయత్నంగా అభివర్ణించింది. ప్రజాస్వామ్యంలో మీడియా స్వతంత్రంగా పని చేయాల్సిన అవసరాన్ని తాము మరో సారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామని, ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభమైన మీడియాను గౌరవించడం, ప్రోత్సహించడం, రక్షణ కల్పించేలా చూడాలని మరోసారి కోరుతున్నామని గిల్డ్ ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా సైతం ఈ దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియన్ ఉమెన్ ప్రెస్ కార్ప్, ముంబయి ప్రెస్‌క్లబ్ , ఢి ల్లీ జర్నలిస్ట్ యూనియన్ సహా పలు జర్నలిస్టు సం ఘాలు సైతం ఈ దాడులను ఖండించాయి.
కులగణన డిమాండ్లను పక్కదారి పట్టించేందుకే
చైనాతోసంబంధాలున్నాయనే ఆరోపణలతో ఆన్‌లైన్ న్యూస్‌క్లిక్ జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లపై ఢిల్లీ పోలీసులు దాడులు చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. న్యూస్‌క్లిక్ జర్నలిస్టులపై ఉదయాన్నే దాడులు చే పట్టడం బీహార్‌లో చేపట్టిన కులగణనలో వెల్లడైన అంశాలపై ప్రభుత్వ నైరాశ్యాన్ని వెల్లడిస్తోందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. బీహార్ కులగణనలో సంచల న విషయాలు వెలుగు చూడడం, దేశవ్యాప్తంగా కులగణ న చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో జర్నలిస్టులపై దాడులకు తెగబడి ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలకు తెరలేపిందని పేర్కొన్నారు. కేంద్ర పాలకుల ముందు ప్రశ్నలు తలెత్తినప్పుడల్లా వారు తప్పించుకునే ధోరణిని ఆశ్రయిస్తారని ట్విట్టర్ వేదికగా పవన్ ఖేరా ఎద్దేవా చేశారు.
తప్పు చేస్తే దర్యాప్తు చేస్తారు: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
ఢిల్లీ పోలీసుల సోదాలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూ ర్ స్పందిస్తూ దీనిని తాను సమర్థించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా, ఏదయినా తప్పు చేస్తే దర్యాప్తు సంస్థలు నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం విచారించే స్వేచ్ఛ ఉంటుందని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News