Sunday, December 22, 2024

ప్రతిపక్షాలపై దాడులు: కెకె

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ప్రతిపక్షాలపై బిజెపోళ్లు దాడులు చేస్తున్నారని రాజ్యసభ ఎంపి కె కేశవరావు మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి, ఎంఎల్ సి కవితపై సిబిఐ, ఐటి దాడులు చేసిన నేపథ్యంలో కెకె మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు దొంగలు, తాము మంచి వాళ్లమనేలా బిజెపోళ్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పేరు చేర్చిన విషయం తెలిసిందే. సిబిఐ తన వెబ్ సైట్‌లో పొందుపరిచిన ఎఫ్‌ఐఆర్‌ను క్షుణ్ణంగా ఆమె పరిశీలించారు. దాంతో ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని కవిత పేర్కొన్నారు.  అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చినట్లుగా ఇడి పేర్కొన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో సౌత్ గ్రూప్‌ను శరత్‌రెడ్డి, కవిత, వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రించేవారని ఇడి వెల్లడించిన విషయం విధితమే.

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఐటి సిబ్బంది మల్లారెడ్డి ఇంటితోపాటు కుమారుడు, అల్లుడి ఇళ్లలోనూ విస్తృతంగా తనిఖీలు చేశాయి. ఐటి రిటర్న్స్ డాక్యుమెంట్లు క్షుణ్ణంగా పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News