Wednesday, January 22, 2025

ఉక్రెయిన్ నగరాలపై దాడులు ముమ్మరం

- Advertisement -
- Advertisement -

Attacks on Ukraine cities intensify

లీవ్ విమానాశ్రయం
పరిసరాల్లో క్షిపణుల వర్షం
దాడుల్లో ఉక్రెయిన్
సినీ నటి మృతి

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా పాశవిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్ సైనిక దళాలతో పాటు సామాన్య ప్రజలను కూడా విడిచిపెట్టడం లేదు. ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటే కాలం గడుతున్న వారిపై క్షిప ణుల మోత మోగిస్తోంది. శు్రక్రవారం తా జాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగర శివా ర్లలోని ప్రాంతాలతో పాటుగా లీవ్ నగర శివారు నివాస ప్రాంతాలపైనా క్షిపణులతో విరుచుకుపడింది. పోలండ్ సరిహద్దులకు అత్యంత చేరువగా ఉన్న లీవ్ నగరం ఇప్ప టివరకు పెద్దగా రష్యా దాడులకు గురి కా లేదు. దీంతో ఉక్రెయిన్‌లో దాడులు జరు గుతున్న ఇతర ప్రాంతాలనుంచి వలస వెళ్లే వారిలో చాలామంది ఈ నగరంలోనే ఆశ్ర యం పొందుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో రష్యాబలగాలు ఈ నగరాన్నీ వదిలిపెట్టడం లేదు. గత వారం నగర సమీపంలోని ఓ సైనిక శిక్షణా కేంద్రంపై జరిపిన క్షిపణి దాడిలో 35 మందికి పైగా చనిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున నగరం సెంటర్‌కు తక్కువ దూరంలో ఉండే శివారు ప్రాంతాలు లక్షంగా రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. విమానాశ్రయ సమీప ప్రాంతాలపై జరిగిన ఈ దాడుల్లో మిలిటరీ విమానాల మరమ్మతు ప్లాంట్ భవనం ధ్వంసమయినట్లు స్థానిక మేయర్ ఆండ్రీ సాదోయ్‌వి వెల్లడించారు.

అయితే ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదన్నారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో వరస పేలుళ్లు సంభవించాయని, పేలుళ్ల తీవ్రతకు సమీపంలోని భవనాలు సైతం వణికి పోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నల్లసముద్రంలోంచి ఈ క్షిపణులను ప్రయోగించారని, అయితే ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన వెస్ట్రన్ కమాండ్ ఆరు క్షిపణుల్లో రెండింటిని పేల్చేసిందని నగర మేయర్ ఆండ్రీ సాదోయ్‌వి చెప్పారు. ఈ దాడుల్లో ఓ బస్సు మరమ్మతు కేంద్రం కూడా దెబ్బతిన్నట్లు ఆయన చెప్పారు. పేలుళ్ల తర్వాత చాలా గంటలపాటు దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయని ఆయన తెలిపారు.

కీవ్ నివాస భవనంపై దాడి: ఉక్రెయిన్ సినీ నటి మృతి

మరో వైపు శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్ శివారు ప్రాంతాలపైనా వరస క్షిపణి దాడులు కొనసాగాయి. అయిదంతస్థుల నివాస భవనంపై క్షిపణి శకలాలు పడిన ఈ సంఘటనలో ఒకరు చనిపోగా,నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. భవనంనుంచి 12 మందిని రక్షించామని, 98 మందిని ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. కాగా రష్యా జరిపిన దాడిలో ఉక్రెయిన్ కళాకారిణి, నటి ఒక్సానా షెవెట్స్( 67)మృత్యువాత పడినట్లు ఆమె సభ్యురాలుగా ఉన్న యంగ్ థియేటర్ అనే సంస్థ వెల్లడించింది. ఇదే విషయాన్ని ధ్రువీకరించి ఉక్రెయిన్ మీడియా రష్యా యుద్ధంలో ఒక్సానా హత్యకు గురైనట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌లో కొన్ని దశాబ్దాలుగా వెండితెరపై వెలిగిన ఒక్సానా థియేటర్ కళాకారిణిగా, నటిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో దేశంలోని అత్యున్నత పురస్కారాలనూ సొంతం చేసుకున్నారు. కేవలం థియేటర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా ఉక్రెయిన్ సినిమాలు,టీవీ షోలలో ఆమె ఎంతో పాపులర్ అయ్యారు. మరోవైపు ఉక్రెయిన్ తూర్పు నగరం క్రామ్‌టోరిస్క్ లో నివాస , పరిపాలనా భవనాలపైనా క్షిపణి దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో ఇద్దరు చనిపోయినట్లు ఆ ప్రాంత గవర్నర్ పావ్లో కిరిలెంకో తెలిపారు.

ఇదిలా ఉండగా గత నెల 24న రష్యా దాడులు మొదలైనప్పటినుంచి ఉక్రెయిన్‌నుంచి పొరుగగు దేశమైన పోలాండ్‌లోకి వచ్చిన శరణార్థుల సంఖ్య 20 లక్షలు దాటింది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. పోలాండ్ బోర్డర్ గార్డ్ ఈ విషయాన్ని తెలిపింది. కాగా ఉక్రెయిన్‌లో రష్యా దాడులు మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు 816 మంది పౌరులు మృతి చెందారని, మరో 1,333 మంది గాయపడ్డారని ఐరాస హక్కుల కార్యాలయం( ఒహెచ్‌సిహెచ్‌ఆర్) తాజాగా వెల్లడించింది.

మేరియుపోల్ థియేటర్‌నుంచి
130 మందిని కాపాడాం

రష్యా వైమానిక దాడుల్లో ధ్వంసమైన మేరియుపోల్ లోని థియేటర్‌నుంచి ఇప్పటివరకు 130 మందిని కాపాడామని ఉక్రెయిన్ మానవ హక్కుల ప్రతినిధి లియుడ్మిలా డెనిపోవా శుక్రవారం తెలిపారు. దాడులు జరగక ముందు దాదాపు వెయ్యి మంది అందులో ఆశ్రయం పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు సహాయక చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఉక్రెయిన్‌కు సాయాన్ని కొనసాగిస్తాం
ఐరాసలో భారత్ వెల్లడి

ఐక్యరాజ్య సమితి : రష్యాయుద్ధంతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్‌లో మానవతా పరిస్థితులు నానాటికీ దిగజారుతుండడంపై భారత్ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లో మానవ సంక్షోభంపై తక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని అభిప్రాయపడిన భారత్.. రానున్న రోజుల్లో ఆ దేశానికి మరింత సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారి టిఎస్ తిరుమూర్తి వెల్లడించారు.ఉక్రెయిన్‌లో సంక్షోభాన్ని పరిష్కరించే అంశంపై అమెరికా తదితర దేశాల అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయింది. ఈ సమావేశంలో తిరుమూర్తి మాట్లాడుతూ..‘ యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి ఉక్రెయిన్‌లో పరిస్థితులుదారుణంగా క్షీణిస్తున్నాయి. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే 30 లక్షలకు పైగా పౌరులు పొరుగు దేశాలకు వలస వెళ్లారు. ఉక్రెయిన్‌లో మానవతా పరిస్థితులపై భారత్ తీవ్రవిచారం వ్యక్తంచేస్తోంది.

ఆ దేశ పౌరులకు మానవత్వంతో నిష్పాక్షికంగా సాయం అందించాల్సిన అవసరం ఉంది.దీనిపై రాజకీయాలు చేయొద్దు. చర్చలు, దౌత్య విధానాలద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయమై భారత ప్రధాని నరేంద్ర మోడీ పలుమార్లు ఇరు దేశాల అధినేతలతో మాట్లాడారు’ అని తెలిపారు. ఉక్రెయిన్‌నుంచి ఇప్పటికే 22,500 మంది భారతీయులను స్వదేవానికిసురక్షితంగా తీసుకువచ్చినట్లు తిరుమూర్తి ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా మరో 18 దేవాల పౌరుల తరలింపులోను సాయమందిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియకు సహకరించిన ఉక్రెయిన్, దాని పొరుగు దేశాల అధికారులకు కృతజ్ఞతలు తెలియజేవారు. ఉక్రెయిన్ పౌరుల కోసం ఇప్పటికే భారత్ 90 టన్నులకు పైగా ఔషధాలు, ఇతర సహాయ సామగ్రిని పంపించినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఆ దేశానికి ఇంకా ఏం అవసరమో గుర్తించి ఆ రిలీష్ మెటీరియల్‌ను పంపిస్తామని తిరుమూర్తి తెలిపారు.

రష్యాను భారత్ బహిరంగంగా ఖండించాలి
అమెరికా కాంగ్రెస్ సభ్యుల వినతి

వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడి విషయంలో మరింత గట్టిగా మాట్లాడాలని అమెరికా కాంగ్రెస్‌లో అధికార, ప్రతిపక్షాలకు చెందిన సభ్యుల బృందం గురువారం భారత్‌ను కోరింది. కాంగ్రెస్ సభ్యుడు జో విల్సన్ ఇండోఅమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా నేతృత్వంలో సభ్యులు అమెరికాలో భారత రాయబారి తరన్‌జిత్ సింగ్ సవధూను కలిశారు. ఈ సందర్భంగా వారు అ అంశాన్ని చర్చించారు. విల్సన్‌తో కలిసి భారత రాయబారి సంధూను కలిసే అవకాశం లభించినందుకు ఖన్నా హర్షం వ్యక్తం చేస్తూ ఉక్రెయిన్‌లో పుతిన్ పౌరులు లక్షంగా చేసుకుని దాడులు జరపడంపై మరింత గట్టిగా మాట్లాడాలని కోరారు. శాంతికోసం తన పలుకుబడిని ఉపయోగించాలని ఇరుపక్షాల్లోని భారతీయ మిత్రులు భారత్ కోరుతున్నారనిఆయన ఒక ట్వీట్‌లో తెలిపారు.

కాగా అమెరికాలో భారత రాయబారిని తోటి సభ్యులతో కలిసి భేటీ కావడం పట్ల విల్సన్ మరో ట్వీట్‌లో హర్షం వ్యక్తం చేస్తూ, ఉక్రెయిన్‌లో పుతిన్ పాల్పడుతున్న అమానుష చర్యలను ప్రపంచ దేశాల నేతలంతా ఖండించాల్సిన అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను భారత్ విస్పష్టంగా ఖండించాలని అమెరికా కాంగ్రెస్ సభ్యులు కోరడం గత రెండు రోజుల్లో ఇది రెండో సారి. బుధవారం ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు టెడ్ డబ్లు లీయు, టామ్ మాలినోవిస్కీలు రష్యా దాడులను భారత్ ఖండించాలని కోరుతూ సంధూకు లేఖ రాశారు. ‘ రష్యాతో భారత్ సంబంధాలను తాము అర్థం చేసుకున్నప్పటికీ ఈ నెల2న ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌కు గైరు హాజరు కావాలని మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాకు నిరాశ కలిగించింది’ అని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News