- Advertisement -
రంగారెడ్డి: నగరంలోని రాజేంద్రనగర్ అత్తాపూర్ మూసీ నదిలో శనివారం మొసలి కలకలం రేపింది. మొసలిని చూసి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. బండ రాయి మీద సేద తీరిన మొసలిని చూసి భయపడిన స్థానికులు, మొసలిని చూడడానికి ఎగబడ్డారు. ఇటీవలి కాలంలో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, గండిపేట క్రస్ట్ గేట్లు ఎత్తి భారీగా నీటిని విడుదల చేసిన నేపథ్యంలో మొసలి వరద నీటిలో కొట్టుకు వచ్చినట్లుగా భావిస్తున్నారు. మొసలిని చూడడానికి భారీగా జనం రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని జనాలను చెదర గొట్టిన ట్రాఫిక్ క్లియర్ చేశారు.
- Advertisement -