రూ.600 కోట్లు పెట్టడానికి
ముందుకొచ్చిన అట్టారో ఇండియా కంపెనీ
ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : పెట్టుబడుల రంగంలో తెలంగాణ దూసుకపోతోంది. వరదలా పెట్టుబడులు తర లి వస్తున్నాయి. అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు కేంద్రంగా హైదరాబాద్ మారుతోంది. తాజాగా రాష్ట్రానికి మరో భా రీ పెట్టుబడి రానుంది. ప్రముఖ సం స్థ అయిన అట్టెరో ఇండియా కంపెనీ రాష్ట్రం లో సుమా రు రూ. 600 కోట్లతో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముం దుకు వచ్చిం ది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు సోమవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ పెట్టుబడి ద్వారా 300 మం దికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. పరోక్షంగా చాలా మంది ఉపాధి లభించనుందని తెలిపారు. ఇం దుకు కంపెనీ యజమాన్యానికి అభినందనలు తెలిపారు. కాగా అట్టెరో కంపెనీ రీసైక్లింగ్, అప్‌సైక్లింగ్, లి-అయాన్ రీసైక్లింగ్, రివర్స్ లాజిస్టిక్స్, కన్సల్టింగ్, కార్బన్ ఫుట్‌ప్రిం ట్ ఇండస్ట్రీలో గుర్తింపు పొందింది. విలువైన, ఫెర్రస్, ఎర్త్ లోహాలను వెలికితీయడంలో అనుభవం ఉన్న కంపెనీకి నోయిడాలో సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. కాగా రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న టిఎస్.ఐపాస్‌తో పరిశ్రమల రంగాన్ని పరుగులు తీయిస్తోంది.
ఈ విధానం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడు లు పెట్టేందుకు ముందు కు వచ్చిన కంపెనీలకు కేవలం పదిహేను రోజుల్లోనే అన్ని రకాల అనుమతులను జారీ చేస్తోంది. ఈ విధానం లో దేశంలో మరే రాష్ట్రంలో లేకపోవడం.. పెట్టుబడిగా పెట్టే ప్రతి రూపాయికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థా యి భద్రతను ఇస్తోంది. ఇది పెట్టుబడిదారుల కు వరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలన్నీ హైదరాబాద్ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే రాష్ట్రానికి 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అలా గే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో తెలంగాణ మంచి ప్రతిభ కనబరుస్తోంది. దీంతో రాష్ట్రంలో ఒకసారి పెట్టుబడి పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇక్కడే మరింత పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి పెట్టుబడే 24 శాతంగా నమోదు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.