Sunday, December 22, 2024

భర్త స్నేహితురాలిపై కిరాయి రేపిస్టులతో అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్
పరిధిలో ఆలస్యంగా
వెలుగు చూసిన దారుణం
నిందితురాలు, నలుగురు
యువకుల అరెస్టు,
రిమాండ్‌కు తరలింపు

మన తెలంగాణ/హైదరాబాద్: తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ యువతి మరో యువతిపై దాడి చేయడమే కాకుండా నలుగురు యువకులతో అత్యాచారయత్నం చేయించిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్ర కారం… కొండాపూర్ శ్రీరామ్‌నగర్‌లో గాయత్రి, శ్రీకాంత్ దంపుతులు నివాసముంటున్నారు. శ్రీకాంత్ లెక్చరర్‌గా ప నిచేస్తుండగా, గాయత్రి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది. ఎపిలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీహర్షిత (25) గాయత్రికి సోషల్ మీడియాలో పరిచయం అయింది. ఇద్దరు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండడంతో తరచూ ఛాటింగ్, ఫోన్లు చేసుకునేవారు. ఈ క్రమంలోనే గాయత్రి ఉంటున్న కాలనీలోకి శ్రీహర్షిత షిఫ్ట్ అయింది. అప్పటి నుంచి గాయత్రి ఇంటికి శ్రీహర్షిత తరచూ వచ్చేది. దీంతో కొన్ని రోజులుగా భర్త శ్రీకాంత్, శ్రీహర్షితకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించింది.

ఈ నెల 26వ తేదీన శ్రీహర్షిఇంటికి రావాల్సిందిగా గాయత్రి పిలిచి ఇంట్లోకి రాగానే తన రూములో బంధించింది, అప్పటికే నలుగురు యువకులను డబ్బులు ఇచ్చి ఇంటికి రప్పించింది. బాధితురాలు ఇంట్లోకి వెళ్లగానే నలుగురు యువకులు శ్రీహర్షితపై దాడి చేశారు. అంతేకాకుండా అత్యాచారయత్నం చేస్తుండడంతో గాయత్రి వీడియో తీసింది. బాధితురాలు అరవకుండా ఉండేందుకు నోట్లో గుడ్డలు కుక్కి ప్రైవేట్ భాగాల్లో దాడి చేశారు. ఎవరికైనా చెబితే వీడియో సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించింది. ఈ దాడిలో బాధితురాలు తీవ్రంగా గాయపడి తీవ్రంగా రక్తస్రావం కావడంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. అనంతరం తనపై జరిగిన అఘాయిత్యంపై బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రి, నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో యువతికి వరుసకు సోదరుడు ఉన్నట్లు తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News