Monday, November 18, 2024

గవర్నర్ పై బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం: ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆర్‌టిసి విలీనం బిల్లు విషయంలో గవర్నర్ పై బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్ మండిపడ్డారు.  అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శనివారం ఈటెల మాట్లాడుతూ గవర్నర్ హైదరాబాద్ లో లేరని చెపుతున్నా ప్రభుత్వం హడావుడి చేస్తోందని విమర్శించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఆర్‌టిసి కార్మికులు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రభుత్వంలో ఆర్‌టిసిని విలీనం చేయడాన్ని తాము కూడా స్వాగతిస్తున్నామని ఈటల చెప్పారు. గవర్నర్ కు ఈ బిల్లును మొన్ననే పంపారని దాన్ని ఆమె చూడాలి, అధ్యయనం చేయాలి, సంతకం చేయాలని అన్నారు.

ఆర్‌టిసి కార్మికులను బలవంతంగా రాజ్ భవన్ వద్దకు తీసుకొచ్చారని మండిపడ్డారు. వచ్చే ప్రభుత్వంలోనే ఆర్‌టిసి కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఆర్‌టిసి కార్మికులకు రెండు పిఆర్‌సిలు బకాయి పడ్డారని, ఆర్‌టిసిలో పని చేసే ఇతర సిబ్బందిని పర్మినెంట్ చేయాల్సి ఉందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. గెస్ట్ లెక్చరర్స్, సెకండ్ ఎఎన్‌ఎమ్ లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మహిళా సంఘాలు అనేక మంది తమ సమస్యలు చెప్పుకుందామంటే ఎవరు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. మంత్రులు, అధికారులు భరోసా ఇవ్వడం లేదని, సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ నిర్వహించాలన్నారు. మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News