Monday, December 23, 2024

ప్రేమ జంట కిడ్నాప్‌కు యత్నం..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కిడ్నాపర్ల నుంచి ప్రేమ జంటను కాపాడిన సంఘటన నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎపిలోని విజయవాడకు చెందిన ప్రేమికులు వివాహం చేసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. వారు వివాహం చేసుకోవడం ఇష్టంలేని కుటుంబ సభ్యులు రెండు కార్లలో వచ్చి కిడ్నాప్ చేసేందుకు యత్నించారు.

కిడ్నాపర్లను ప్రతిఘటించిన ప్రేమికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కిడ్నాపర్ల నుంచి ప్రేమికులను రక్షించారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News