Friday, November 22, 2024

అంజన్ కుమార్ యాదవ్ కుమారుడిపై హత్యాయత్నం కేసు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హుస్సేనీఅలాం పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ కుమార్ యాదవ్‌పై కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఆయన కూడా కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. హుస్సేనీఆలాంలో నివాసం ఉండే గొల్లకిడ్కీలో పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. ఇది కాస్త కొట్టుకునే వరకు వెళ్లింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ప్రకాష్ యాదవ్, మధుకర్ యాదవన్ అనే ఇద్దరు వ్యక్తులను అరవింద్‌కుమార్ యాదవ్ కొట్టారు. వీళ్లిద్దరు నైబర్సే కాకుండా అరవింద్‌కు దూరపు బంధువులు అనే అంటున్నారు. వాగ్వాదం జరుగుతున్న టైంలో అరవింద్ కుమార్ కోపంతో చేతిలోకి బీర్ బాటిల్ తీసుకొని మధుకర్ బంధువు అయిన శ్రీకాంత్ పై దాడి చేశారు.

దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికులు జోక్యం చేసుకొని వారందర్నీ శాంతిపజేశారు. అక్కడి నుంచి ఆవేశంతో వెళ్లిపోయిన అరవింద్ తన గ్యాంగ్‌తో మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చినట్టు చెబుతున్నారు. కాసేపటి తర్వాత గోపాల్, నరేష్, మొహిసిన్ సహా ఇతర స్నేహితులతో అపార్టమెంట్ ఏరియాకు వచ్చిన అరవింద్ కుమార్ మధుకర్‌ను కొట్టారు. అతని ఇంటిలోని వస్తువులను కూడా ధ్వంసం చేశారు. దీన్ని అడ్డుకున్న మహిళలపై కూడా దౌర్జానికి దిగారని చెబుతున్నారు. అసభ్య కరమైన పదాలతో తిట్టారని అంటున్నారు. వ్యక్తులను కొట్టి, ఇంట్లో వాళ్లను తిట్టడమే కాకుండా ఇంటిలోని వస్తువులను కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే వచ్చిన వాళ్లు మధుకర్ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, బంగారం, నగదు తీసుకెళ్లిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు. అరవింద్ కుమార్ బ్యాచ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత స్థానికు సాయంతో మధుకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఇంట్లో చొరబడి దౌర్జన్యం చేయడం, బెదిరించడం, హత్యాహత్యం సెక్షన్‌ల కింద కేసులు రిజిస్టర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News