Friday, December 20, 2024

ఏడేండ్ల చిన్నారిపై లెంగికదాడికి యత్నం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : రాష్ట్రానికి చెందిన ఓ కామంధుడు.. ఏడేండ్ల చిన్నారిపై లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించగా స్థానికులు గమనించి కాపాడిన సంఘటన ఖమ్మం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని పోలేపల్లి పరిధిలోని రాజీవ్‌ గృహకల్ప వద్ద ఉన్న స్ప్రింగ్లిఫ్ స్కూల్లో మండలంలోని ఓ గ్రామానికి చెందిన చిన్నారి చదువుకుంటుంది. మంగళవారం స్కూల్ ఎదుట ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యప్రసాద్(30) అనే వ్యక్తి ఐస్‌క్రీం అమ్ముకునేందుకు వచ్చాడు. ఈ క్రమంలో చిన్నారికి ఎస్‌క్రీం బండి వద్దకు రాగా ఐస్‌క్రీం ఇస్తానని నమ్మబలికి చేయిపట్టుకుని తీసుకెళ్లేందుకు యత్నించాడు.

భయపడిన చిన్నారి పెద్దగా కేకలు వేసి ఎడవడంతో గమనించిన స్థానికులు సత్యప్రసాద్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చిన్నారిని నిందితుడు తీసుకేళ్లేందుకు ప్రయత్నించిన విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి స్థానికులు తీసుకువెళ్లగా వారు విషయం బయటకు వస్తే తమ స్కూల్ పరువు పోతుందని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఎదుటే చిన్నారిని ఎత్తుకుపోయేందుకు ప్రయత్నం జరిగితే కనీసం యాజమాన్యం దృష్టి సారించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News