Monday, December 23, 2024

డోర్లకు డ్రిల్ వేసి చోరీకి యత్నం…

- Advertisement -
- Advertisement -

 

అదిలాబాద్ జిల్లాలో దొంగలు హడలెత్తిస్తున్నారు. ఇచ్చోడలోని విద్యానగర్, సాయినగర్ కాలనీల్లో అర్ధరాత్రి దొంగలు చొరబడి బీభత్సం సృష్టిస్తున్నారు. తలుపులకు డ్రిల్ వేసి మరీ డోర్లను తొలగించి చోరికి యత్నించారు. ఇళ్లలోని వారు మేల్కొని కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. సిసి కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను బట్టి చెడ్డి గ్యాంగ్ దొంగలే అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజుల్లో జైనథ్, బోథ్ మండలాల్లో దొంగలు భీభత్సం సృష్టించారు. వరుస ఘటనలతో అప్పమత్తమైన పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాంలిపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News