Friday, January 24, 2025

మాజీ సిఎం జగన్‌పై హత్యాయత్నం కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

మాజీ సిఎం జగన్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఉండి టిడిపి ఎంఎల్‌ఎ రఘురామకృష్ణరాజును కస్టోడి యల్ టార్చర్ పెట్టిన ఘటనలో ఈ కేసును నమోదు చేశారు. సెక్షన్ 120బి, 166, 167, 197, 307, 326, 465, 508 (34) కింద కేసు నమో దు చేశారు. రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పీఎస్‌లో కేసు నమోదయింది. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణంరాజు తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసులో జగన్‌ను ఎ3గా పోలీసులు పేర్కొన్నారు. ఎ1గా సిఐడి మాజీ డిజి సునీల్ కుమార్, ఎ2గా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ఎ4 గా అప్పటి సిఐడి అడిషనల్ ఎస్‌పి విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు. వీరితో పాటు మరికొందరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. జగన్ అధికారం కోల్పోయాక నమోదైన తొలి కేసు ఇది. 2021 మే 14 జరిగిన ఘటనపై నిన్న రఘురామరాజు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడించారు.

కస్టడీలో తనను తీవ్రంగా హింసించారని, తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ, తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నం చేశారని, ఫోన్ పాస్ వర్డ్ చెప్పాలని కొట్టారని ఆరోపించారు. తనకు చికిత్స చేసిన జిజి హెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదులో చేశారు. పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని వెల్లడించారు. జగన్‌ను విమర్శిస్తే చంపుతామని సునీల్ కుమార్ బెదిరించారని వెల్లడించారు. తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని, ఐదుగురు ఆగంతుకులతో దారుణంగా హింసించి, వీడియో తీసి అప్పటి సిఎం జగన్ మోహన్ రెడ్డికి చూపించారని రఘురామకృష్ణరాజు తెలిపారు. తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేసిన పరిస్థితి నెలకొందని, అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. జగన్, సునీల్ ఇద్దరూ కలిసి తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదనేది రుజువవుతుందని తెలిపారు. తనపై కేసు నమోదుపై సిఐడి మాజీ డిజి సునీల్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘సుప్రీం కోర్టులో మూడేళ్ల నడిచి సాక్ష్యాత్తూ సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్‌ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను‘ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News