Monday, January 20, 2025

ఇల్లు అద్దెకు ఇప్పిస్తానని అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

Attempted rape by saying he would rent house

ఆలస్యంగా వెలుగులోకి సంఘటన
పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి

మనతెలంగాణ, హైదరాబాద్ : ఇల్లు అద్దెకు ఇస్తానని చెప్పి అత్యాచారం చేసేందుకు యత్నించిన సంఘటన నగరంలోని చాదర్‌ఘాట్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ఇంటి అద్దె కోసం ఓ యువతి తిరుగుతోంది. ఆన్‌లైన్‌లో flatnflatmate పేరుతో సైట్ కన్పించింది. సైట్‌లోని వివరాలు నమోదు చేయగా హమీద్ అనే వ్యక్తి లైన్‌లోకి వచ్చాడు. ఇంటిని అద్దెకు ఇప్పిస్తానని చెప్పాడు, వాట్సాప్ కాల్ చేసి యువతితో మాట్లాడాడు. ఈ నెల 19వ తేదీన అద్దె ఇల్లు కోసం యువతి హమీద్‌కు ఫోన్ చేయగా ఎల్‌బి నగర్‌లోని కామినేని ఆస్పత్రి వద్దరు రమ్మన్నాడు. అక్కడికి వెళ్లి ఫోన్ చేయగా ఓవైసీ ఆస్పత్రి వద్దరు రావాలని చెప్పాడు, ఆ ఏరియా తనకు తెలియదని చెప్పడంతో కర్మన్‌ఘాట్ వరకు వస్తే పికప్ చేసుకుంటానని చెప్పాడు. యువతి కర్మన్‌ఘాట్ వద్దకు వెళ్లగానే హమీద్ వెళ్లి యువతిని బైక్‌పై అక్బర్ బాగ్‌లోని ఆనంద్ నగర్‌లో ఉన్న తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. దీనిని ఆసరాగా చేసుకున్న నిందితుడు యువతికి ఇంటిని అద్దెకు ఇస్తానని చెప్పి తీసుకుని వెళ్లాడు.

ఇంట్లోకి వెళ్లగానే ఇంటి తలుపు మూసివేశాడు. యువతిని బెదిరించి నగ్నంగా బంధించాడు. ఫోన్ లాక్కున్నాడు, కౌగిలించుకునేందుకు యత్నించగా యువతి ప్రతిఘటించింది. దీంతో యువతిని కొట్టి బలవంతం చేశాడు. అయినా యువతి లొంగకపోవడంతో సాయంత్రం 4గంటలకు నల్గొండ క్రాస్ రోడ్డు బస్టాప్‌లో వదిలేసి వెళ్లాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన బాధితురాలు తనకు జరిగిన అవమానాన్ని ఎవరికి చెప్పలేదు. పోలీస్ స్టేషన్‌కు వెళ్తే పరువు పోతుంది భావించి కుమిలిపోయింది. ఈ నెల 24వ తేదీన తన స్నేహితురాలికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. వెంటనే బాధితురాలు చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News