Wednesday, January 22, 2025

మైనర్ బాలికపై అత్యాచార యత్నం

- Advertisement -
- Advertisement -

కౌటాలః కౌటాల మండలంలోని వీర్దండి గ్రామంలో శుక్రవారం సాయంత్రం మైనర్ బాలికపై అత్యాచారయత్నం జరిగినట్లు సమాచారం. ఈ మేరకు శనివారం కాగజ్‌నగర్ డిఎస్‌పి కరుణాకర్, కౌటాల సిఐ స్వామి, ఎస్‌ఐ ప్రవీణ్, సఖి కేంద్రం సభ్యులు గ్రామంలో విచారణ చేపట్టారు.

శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై ఇంట్లో ఎవరు లేని సమయంలో అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News