Monday, January 20, 2025

ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం రూరల్ : ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మం రూరల్ మండలం గోల్లపాడులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బోయినపల్లి వీరబాబు(35) తన ఇంటి పక్కన ఉన్న ఓ చిన్నారి ఆడుకుంటుండగా తీసుకువెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో చిన్నారి ప్రతిఘటించగా గాయపరిచాడు. దీంతో చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News