Sunday, December 22, 2024

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

అంబర్ పేట: మాయమాటలు చెప్పి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానానికి యత్నించిన సంఘటన మంగళవారం నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చేసిన వెంకటేష్ అతని భార్య సరస్వతికి ఐదేళ్ల కూతురుతో కాచిగూడ స్టేషన్ దగ్గరలోని బస్టాండ్ సమీపంలో ఫుట్‌పాత్‌పై ఉంటూ బిక్షాటన చేస్తూ జీవన గడుతున్నారు. అదే ప్రాంతంలో నివసించే నిందితుడు (25) ఆ చిన్నారిపై కన్నేసి మంగళవారం తల్లిదండ్రులు లేని సమయంలో మాయమాటలు చెప్పి ఒంటరిగా ఉన్న ఐదేళ్ల చిన్నారిని నల్లకుంటలోని స్ట్రీట్ నెంబర్ 4లోని ప్రాంతంలోకి తీసుకువచ్చి చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడడానికి యత్నిం చడంతో చిన్నారి ప్రతిఘటించింది.

దీంతో పక్కనే ఉన్న బండరాయితో చిన్నారి తలపై మోదడంతో తలకు తీవ్ర గాయం కావడంతో ఒక్కసారిగా అరుపులు చేయడంతో నిందితుడు పారిపోతుడంతో స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి నల్లకుంట పోలీసులకు అప్పగించారు.తలకు గాయాల పాలైన బాలికను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆ సుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నామని నల్లకుంట పోలీసులు తెలిపారు. చిన్న పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టవద్దని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News