Sunday, December 22, 2024

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం..

- Advertisement -
- Advertisement -

పరిగి: అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచార యత్నానికి ఒడిగట్టిన సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం వివరాలీలా ఉన్నాయి. మండల పరిధిలోని బర్కత్‌పల్లి గ్రామ పంచాయతీకి చెందిన బాలగల్ల సత్తయ్య (55) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఆరేళ్ల  చిన్నారి ఆడుకుంటు ఉండగా మాయ మాటలు చెప్పి గ్రామంలో ఉన్న పాడు బడిన ఇంటిలోకి తీసుకవెళ్లి అసభ్యకరంగా, చెప్పలేని విధంగా ప్రవర్థించి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన రంజిత్ వెళ్లి అమ్మాయిని కాపాడినట్లు చెప్పారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తయ్యపై పోక్సో చట్టం కింద కేసు నమోద్ చేసి కోర్టులో హాజరు పర్చినట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News