Tuesday, November 5, 2024

అటెన్షన్ డైవర్ట్ నేరస్థుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Attention divert offender arrested in Hyderabad
క్యాష్ డిపాజిట్ చేస్తున్న వారే టార్గెట్
మహిళ నుంచి రూ.1కొట్టేసిన నిందితుడు
అరెస్టు చేసిన ఎస్‌ఆర్ నగర్ పోలీసులు

హైదరాబాద్: క్యాష్ డిపాజిట్ మిషన్‌లో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వస్తున్న వారికి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న నిందితుడిని ఎస్‌ఆర్ నగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.95,000 నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. ఎపిలోని ఈస్ట్‌గోదావరి జిల్లా, రాజోలు మండలం, చింతపల్లి గ్రామానికి చెందిన ఇంటిపల్లి రామారావు అలియాస్ రాము ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. నగరంలోని కెపిహెచ్‌బి కాలనీ, రోడ్డు నంబర్1, వేద లగ్జరీ బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఎటిఎం సెంటర్లలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వస్తున్న వారికి మాయమాటలు చెప్పి వారి వద్ద ఉన్న డబ్బులు కొట్టేస్తున్నాడు. ఎటిఎం సెంటర్ల వద్ద తిరుగుతూ మోసాలు చేసుత్నాడు. తనకు అర్జంట్‌గా డబ్బులు అవసరం ఉన్నాయని, మీకు ఎన్‌ఈఎఫ్‌టి, ఆన్‌లైన్ తదితర వాటి ద్వారా డబ్బులు పంపిస్తానని చెప్పి వారి వద్ద ఉన్న డబ్బులు తీసుకుని నకిలీ మెసేజ్ పంపించి మోసం చేస్తున్నాడు.

నగరంలోని ముషీరాబాద్, బోలకపూర్‌కు చెందిన జైత్వాల గౌతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 7వ తేదీన ఆఫీస్ డబ్బులు రూ.1,00,000 యాక్సిస్ బ్యాంక్ ఎటిఎం డిపాజిట్ మిషన్‌లో డిపాజిట్ చేసేందుకు ఎస్‌ఆర్ నగర్ వచ్చాడు. అదేసమయంలో అక్కడ ఉన్న నిందితుడు తాను ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిస్తానని చెప్పి బాధితుడి వద్ద ఉన్న డబ్బులు తీసుకుని నకిలీ మెసేజ్ పంపి పారిపోయాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు గతంలో కూడా ఇలాగే ఎపి, తెలంగాణ రాష్ట్రంలో నేరాలు చేశాడు. ఎస్‌ఆర్ నగర్, బాచుపల్లి, కెపిహెచ్‌బి, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 27 కేసులు నమోదయ్యాయి. కేసు దర్యాప్తు చేసిన డిఐ పివి రామ్ ప్రసాదరావు, ఇన్స్‌స్పెక్టర్ సైదులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News