Monday, December 23, 2024

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరికలు

- Advertisement -
- Advertisement -
  • విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు: రాష్ట్రంలో కెసిఆర్ చేపడుతు న్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన పలుపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ గ్రామ సర్పంచ్ కె. ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

పలు పార్టీల నుండి బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన వారికి బిఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి మా ట్లాడుతూ పార్టీలో పనిచేసే కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని రానున్న రోజుల్లో పార్టీని మరీంత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర అనంతరం అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువయ్యామని సాధ్యం కానీ పథకాలను సుసాధ్యం చేసిన ఘనత మన ముఖ్యమంత్రికి దక్కిందన్నారు. ము ఖ్యంగా 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, మిషన్ భగీరథ వంటి పథకాలతో పాటు వృద్ధులు, వితంతువుల పెన్షన్ లాంటివి విజయవంతంగా కొనసాగిస్తున్న ఘనత ఉందన్నారు.

అలాగే మహేశ్వరం అభివృద్దికి కృతనిశ్చయంతో ప్రణాళికా బద్ధంగా పనిచేస్తున్నామని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎర్ర శంకరయ్య, ఉపసర్పంచ్ మేకల శ్రీనివాస్, శేఖర్, రాజేందర్, రామ్‌లాల్, జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News