Wednesday, January 22, 2025

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్‌ఎస్‌లో చేరికలు : అరికెపూడి గాంధీ

- Advertisement -
- Advertisement -

శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు ఆకర్షితులై బిఆర్‌ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష ఎన్‌క్లేవ్ కాలనీకి చెందిన బిజెపి పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పోచయ్య బిఆర్‌ఎస్ పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గాంధీ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు బిఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంరతం గాంధీ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమైన నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరడం సంతోషకరంగా ఉందని, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షీతులై పార్టీలో చేరాడం జరుగుతుందని అన్నారు.

పార్టీలో ఉన్నా నాయకులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, అదేవిధంగా ప్రతి కార్యకర్తను కంటికి రెప్పాల కాపాడుకుంటామని, ప్రతి ఒక్కరు కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, శ్రీకాంత్ రెడ్డి, పారునంది శ్రీకాంత్, ఆనంద్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News