Monday, December 23, 2024

అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్‌ఎస్‌లోకి

- Advertisement -
- Advertisement -

పెద్దకొత్తపల్లి : మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండు వా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ స్థాపించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమ పార్టీగా, అధికార పార్టీగా ఎంతో అభివద్ధి చెందుతుంద న్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా సంక్షేమం కోసం సిఎం కెసిర్ అహర్నిశలు కృషి చేస్తున్నార న్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నేతలు టిఆర్ ఎస్ పార్టీవైపు పరుగులు పెడుతున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు బిఆర్‌ఎస్ పార్టీతోనే న్యాయ ం జరుగుతుందన్నారు. కలిసికట్టుగా పార్టీ కోసం కృషి చేసి గ్రామాభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలని, భవిష్యత్తులో కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకు పోతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News