Wednesday, January 22, 2025

అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్‌ఎస్‌లో చేరిక

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల : అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిజెపి ముఖ్య నాయకులు 152 మంది బిఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ లకా్ష్మరెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపాల్టీ పరిధిలోని 4వ వార్డులో రాఘవేంద్ర కాలనికి చెందిన బిజెపి ముఖ్య నాయకులు రాజుగౌడ్, రామకృష్ణగౌడ్, అనుచరవర్గంతో స్థానిక కౌన్సిలర్ కాటేమోని శంకర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బిఆర్‌ఎస్ కండువా కప్పి వారిని పార్టీలోకి స్వాగతించారు.

అనంతరం ఆయన మా ట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు రైతు బీమా 24 గంటల ఉచిత కరెంటు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కి దక్కిందని ఆయన అన్నారు. తెలంగాణ ప్ర భుత్వం ఏర్పడక ముందు రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ 9 సంవత్సరాల కాలంలో 50 సంవత్సరాల అభివృద్ధిని చేసి చూపించారని ఆయన ప్రశంసించారు.

జడ్చర్లకు అతి సమీపంలో సెజ్ ఏర్పాటు చేసి ప్రజలకు, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేశానని అన్నారు. పట్టణం లో వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చానన్నారు. గత 70 సంవత్సరాలు గా పరిపాలించిన కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు ప్రజలకు ఒరగబెట్టింది ఏమి లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిసిసి చైర్మన్ వాల్యానాయక్, జడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యా దయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పిట్టల మురళి, రాంమోహన్, నాగిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News