Thursday, January 23, 2025

అభివృద్ధికి ఆకర్శితులై బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

మంచాల: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరూ ఆకర్శితులై బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్నారని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని చిత్తాపూర్ గ్రామానికి చెందిన బిజెపి నాయకులు బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితబంధు, రైతుబంధు, కల్యాణలక్ష్మీ, కెసిఆర్ కిట్, మిషన్ భగీరథ, సిఎంఆర్‌ఎఫ్, వంటి పథకాలు రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు అండగా నిలుస్తున్నాయన్నారు. కార్యకర్తలు, నాయకులందరూ కలిసి కట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరికీ అండగా ఉండి, ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన కొనసాగుతుందన్నారు. ఈకార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పుల్లారెడ్డి, వైస్ చైర్మన్ బొద్రమోని యాదయ్య, పల్లె జంగారెడ్డి, సత్యనారాయణ, కందాల శ్రీశైలం, రావుల కృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News