Monday, December 23, 2024

అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులై బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. శనివారం కట్టంగూర్‌మండలంలోని కలిమెర గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నా యకులు యాట సుధాకర్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పూదూటి ఆనంద్లతో పాటు మరో 20 కుటుంబాలకు చెందిన పలు పార్టీల నాయకులు కట్ట రాజారాములు, రాయిల ఆనందం, ముస్కు వెంకన్న, ఊట్కూరి శ్రీ శైలం, లవణ్ తదితరులు ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీ లో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి వారికి గులాభీ కండువా లు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ రేగట్టె మల్లి ఖార్జున్ రెడ్డి, ఎంపిపి జెల్లా ముత్తి లింగయ్య, జడ్పీటిసి తరాల బలరాములు, నకిరేకల్ ఏఎంసి వైస్ ఛైర్మన్ పోగుల నర్సింహ్మ, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు, పిఏసిఎస్ ఛైర్మన్ నూక సైదులు, గ్రామ సర్పంచ్ పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ నాగోజు వెంకటాచారి, నాయకులు గాదగోని రామలింగం, తండు గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News