Friday, December 20, 2024

అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:బీఆర్‌ఎస్ సర్కార్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ప్రజలు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నకిరేకల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లిం గయ్య సమక్షంలో ఓగోడు గ్రామ సర్పంచ్ అబ్బగోని విజయలక్ష్మి శ్రీనివాస్
గ్రామశాఖ అధ్యక్షుడు చిట్టిపాక సైదులు ఆధ్వర్యంలో ఓగో డు గ్రామంలో కా ంగ్రెస్ పార్టీ నుంచి 50 కుటుంబాలు బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారికి గులాబి కండువాలను కప్పి ఎమ్మెల్యే చిరుమర్తి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కు టుంబానికి గులాబి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు శక్తి వంచన లే కుండా కృషి చేస్తున్నామని భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇతర పా ర్టీల నుంచి కూడా బీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు ఉంటాయని ఆయన ఆ శాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త క్రమక్షణ, నిబద్దతతో పనిచేసి నకిరేకల్ నియోజకవర్గ అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.

బీఆర్‌ఎస్‌లో పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. పార్టీలో చే రిన వారిలో వార్డు సభ్యులు శాతరాజు రమణ, కోనేటి యల్లమ్మ, రాములు, చింత శేఖర్, చింతపల్లి జానయ్య, చిట్టిపాక రాజు, ఆవుల శివరాజు యాదవ్, దాసరి లక్ష్మణ్, అక్కినపల్లి అనిల్, కోనేటి రాములు, చింత సి రయ్య, అక్కినపల్లి పిచ్చయ్య, చిట్టిపాక అంజ య్య, శ్రీనాధ్, బట్టు విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ పార్టీ ఉ పాధ్యక్షుడు లోడె రమేష్, మార్కెట్‌డైరెక్టర్ పల్లెబోయిన స్కైలాఫ్, బాషాపా క సతీష్, చెట్టుపల్లి అంజయ్య, చిట్టిపాక శ్రీనివాస్, చిట్టిపాక విజయ్‌కుమార్, బోడ జ్యోతి, గద్దపాటి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

నకిరేకల్ మున్సిపాలిటీ 9వార్డులో ఎమ్మెల్యే పర్యటన…
నకిరేకల్ మున్సిపాలిటీ 9వ వార్డులో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదివారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో కలియ తిరుగుతూ సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా పరిష్కరిస్తూ ముందుకు సాగారు. సీసీరోడ్డు, డ్రైనేజి పలు అభివృద్ది పనులను పరిశీలించారు. పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రతి ఒక్కరూ పార్టీలకతీత ంగా బీఆర్‌ఎస్‌కు మద్దతు పలకాలని వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News