Monday, January 20, 2025

అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -
  • గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల టౌన్: రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్దికి ఆకర్షితులై పలువురు బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ధరూర్ మండలం మన్నాపురం గ్రామానికి చెందిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు గోపాల్, బీజేపీ పార్టీ నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అదే విధంగా ధరూర్ మండలం నీళ్లహల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తుంటే.. ప్రతిపక్ష నాయకులు అందుకు భిన్నంగా ప్రచారం చేస్తూ… తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను వచ్చే ఎన్నికల్లో ప్రజలేబుద్ది చెబుతారని అన్నారు.

సీఎం కేసీఆర్ నిరుపేదలకు అనేక పథకాలను అమలు చేసి అర్హులైన వారికి అందించారన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ధరూర్ వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, నీళ్ళహల్లి సర్పంచు, ధరూర్ బీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు డీఆర్ విజయ్, నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, దర్షెలి, పూడూరు చిన్నయ్య, హనుమంతు, చరణ్, గోవిందు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News