Wednesday, January 22, 2025

అభివృద్ధికి అకర్షితులై పార్టీలో చేరికలు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : ముఖ్యమంత్రి కెసిఅర్ చేస్తున్న అభివృద్ధికి అకర్షితులై బిఅర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్నారని సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీలోని రెండవ వార్డు, 6వ వార్డు, మాడుగుపల్లి మండలం అంభంగాపురం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీని వీడి బీఅర్‌ఎస్‌లో చేరగా వారికి ఎమ్మెల్యే భగత్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈస ందర్భంగా మాట్లాడుతూ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి అందుతున్నటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధికి అకర్షితులై పార్టీలోకి చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్, ఎంపీపీ బొల్లం జయమ్మ, మార్కెట్ చైర్మన్లు మర్ల చంద్రారెడ్డి, కూరాకుల వెంకటేశ్వర్లు, బహునూతల నరేందర్, దూళిపాల రామచంద్రయ్య, యడవల్లి మహేందర్‌రెడ్డి, కామెర్ల జానయ్య, అంబటి రా ంబాబు, ఎన్నమల్ల సత్యం, కలకొండ వెంకటేశ్వర్లు, సురభి రాంబాబు, చిరుమామిళ్ల శ్రీనివాస్, దొరేపల్లి వెంకన్న, పగిళ్ల సైదులు, చాపల సైదులు, బైరెడ్డి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News