Wednesday, January 22, 2025

KTR: సింగరేణి ప్రైవేటీకరణపై జంగ్ సైరన్

- Advertisement -
- Advertisement -

సింగరేణిని కేంద్రం పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు పాల్పడుతోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తా రక రామారావు మండిపడ్డారు. తాజాగా సింగరేణిలోని బొగ్గు గనుల వేలానికి కేంద్రం మరోసారి నిర్ణయం తీసుకున్న నేపథ్యం లో కేంద్రానికి వ్యతిరేకంగా భారీ స్థా యిలో మహా ధర్నా కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడిం చారు. ఇందులో భాగంగా ఈ నెల 8వ తేదీన మంచిర్యాల, భూపాల పల్లి, కొత్తగూడెం, రామగుండం కేంద్రాల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్ల డించారు. ఈ మేరకు గురువారం సింగరేణి ప్రాంతం లోని జిల్లాల పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులతో మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు.

ప్రైవేటీకర ణ ప్రయత్నాలను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం అనేకమా ర్లు విజ్ఞప్తి చేస్తున్నా మాత్రం కుట్రపూరితంగా గనుల వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తీసుకువ చ్చిందని ఈ సందర్భంగా కెటిఆర్ మండిపడ్డారు. ఇప్ప టికే పలుమార్లు గనుల వేలం ప్రక్రియ ప్రయత్నం చేసి నా… ప్రైవేటు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. కాగా ఇవే గనులని నేరుగా సింగరేణికి కేటాయించాలని అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజలు ఏకకంఠంతో సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరినా, పట్టించుకోకుండా మరోసారి సత్తుపల్లి బ్లాక్…

3, శ్రావణ పల్లి, పెనగడప గనుల వేలం కోసం మరోసారి నోటిఫికేషన్ కేంద్రం ఇచ్చిందని ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని ఈ సందర్భంగా కెటిఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News