- Advertisement -
సిటిబ్యూరోః హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు సీజ్ చేసిన వాహనాలకు గురువారం వేలం నిర్వహించారు. గోషామహల్‌లోని పోలీస్ గ్రౌండ్‌లో 17వ పబ్లిక్ యాక్షన్ నిర్వహించారు. జాయింట్ సిపి ఎం.శ్రీనివాసరావు సిఎఆర్ హెడ్‌క్వార్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో ఆసక్తి ఉన్న వారు పాల్గొన్నారు. ఎపి, తెలంగాణకు చెందిన 550 మంది వేలంలో పాల్గొన్నారు. 1641 వాహనాల్లో 25 త్రీవీలర్లు, 12 ఫోర్ వీలర్లు 43 టూవీలర్లు ఉన్నాయి. వేలం ద్వారా వచ్చిన రూ.92,70,000 నగదును ట్రెజరీ ఖాతాలో డిపాజిట్ చేశారు.
- Advertisement -