Thursday, January 23, 2025

కరక్కాయ కేసులో వేలం

- Advertisement -
- Advertisement -

నిర్వహించిన సైబరాబాద్ పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః కరక్కాయ ఛీటింగ్ కేసులో సీజ్ చేసిన వస్తువులను సైబరాబాద్ పోలీసులు వేలం నిర్వహించారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో పలువురు అమాయకుల వద్ద నుంచి నిందితులు రూ.3కోట్లు వసూలు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి కార్లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను కోర్టు ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీసులు బుధవారం వేలం నిర్వహించారు. రెండు బైక్‌లు, 80గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.59.5 లక్షల నగదుకు వేలం నిర్వహించారు. కార్యక్రమంలో డిసిపిలు కల్మేశ్వర్, కవిత, ఇన్స్‌స్పెక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News