Sunday, December 22, 2024

12వేల వాహనాల వేలం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను 13 విడతల్లో వేలం వేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ వేలంలో ఇప్పటి వరకు 12,000 వాహనాలను వేలం వేశామని తెలిపారు. వాహనాల వేలం ద్వారా రూ.6.75కోట్లు వచ్చాయని తెలిపారు. మిగతా 5,750 వాహనాలకు మూడు నోటీసులు జారీ చేశామని, వాటికి కూడా త్వరలో వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు.

మరో 4,500కు పైగా వాహనాలు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నాయని, వాటికి కూడా త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని, తర్వాత వాటికి వేలం నిర్వహిస్తామని తెలిపారు. వాహనాల వివరాలకు సంబంధించి www.cyberabadpolice.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరారు. వాహన యజమానులు ఆరు నెలల కాల పరిమిలోపు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలతో పోలీసులను సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు ఆర్‌ఐ, ఎంటిఓ 2 వీరలింగంను 9490617317లో సంప్రదించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News