- Advertisement -
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా దాదాపు 284 పట్టణాల్లో 808 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల ఇవేలాన్ని ప్రభుత్వం త్వరలో నిర్వహించనుంది. దీని ద్వారా రేడియో కమ్యూనికేషన్ అడుగులను మరింత విస్తరించనుందని ఆదివారం కేంద్ర సమాచార, ప్రసారాల శాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఇక్కడ రీజినల్ కమ్యూనికేషన్ రేడియో సమ్మేళన్ (నార్త్) కార్యక్రమంలో ఠాకూర్ మాట్లాడుతూ, రేడియో స్టేషన్లు, కమ్యూనిటీ రేడియో నిర్వహణకు లైసెన్స్ పొందేందుకు ప్రభుత్వం ప్రక్రియను సులభతరం చేసిందని అన్నారు. ప్రస్తుతం 26 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 113 పట్టణాల్లో సుమారు 388 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. రేడియో సేవలను మరింత విస్తరించేందుకు 284 పట్టణాల్లో మూడో దశ 808 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ల ఇవేలాన్ని ప్రభుత్వం నిర్వహించనుందని మంత్రి ప్రకటించారు.
- Advertisement -