Friday, December 20, 2024

సింగరేణిపై కాంగ్రెస్,బిజెపి కుట్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి ని కార్పొరేట్ గద్దలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నామని, సింగరేణికి బొగ్గు గనులు కేటాయించ కుండా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర ఇదని బిఆర్‌ఎస్ వ ర్కిం గ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల త ర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమ ని, సదరు నిర్ణయాన్ని అడ్డుకుంటామని. వేలంలో పా ల్గొ నే వారు ఆలోచించాలని కోరారు. ఈ నిర్ణయాన్ని కేం ద్రం ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణిని తొమ్మిదిన్నరేండ్లు కాపాడితే, ఇప్పుడు రేవంత్‌రెడ్డి బిజెపితో కలిసి బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. సింగరేణి మెడపై కేం ద్రం కత్తి పెట్టింది. కేంద్రం పెట్టిన కత్తికి కాంగ్రెస్ సాన పె డుతోంది.

వేలం పాటను ఉపసంహరించు కోవాలని కేం ద్రాన్ని కోరుతున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, సింగరేణిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా తో మాట్లాడారు. బిఆర్‌ఎస్‌కు పదహారు సీట్లు వస్తే ఏం చేసుకుంటారని సిఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల సమయంలో మాట్లా డారని ఇప్పుడు ఎపిలో టిడిపి పార్టీకి 16 ఎంపి సీట్లు వచ్చాయని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ ఎస్ పార్టీ ఒక రక్షణ కవచం, శ్రీరామ రక్ష అని కెసిఆర్ ఈ 25 ఏండ్లలో ఒక్కసారి కాదు వేల సార్లు చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇవాళ ఏం జరిగిందని ప్రశ్నించారు.

ఇప్పుడు కాంగ్రెస్, బిజెపి కలిసి సింగరేణిని ఖతం చేసే ప్రయత్నం చేస్తు న్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరో 8 స్థానాలు గెలిచిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉద్దేశ పూర్వకంగా సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించడం లేదని చెప్పారు. సిఎం రేవంత్ రెడ్డి బొగ్గు గనుల యాక్షన్‌ను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. 16 ఎంపిల పవర్ ఏంటో ఎపిని చూస్తే తెలుస్తుందని ఉద్ఘాటించారు. రేవంత్ ఎందుకు ఆపడం లేదు. కేసుల భయమా? అని ఎద్దేవా చేశారు. సింగరేణి మెడ మీద కేంద్రం కత్తి పెడితే సిఎం రేవంత్ ఆ కత్తికి సాన పడుతు న్నారని ఎద్దేవా చేశారు. సింగ రేణికి ప్రమాదం వస్తే కాపాడేది బిఆర్‌ఎస్ మాత్రమే నని స్పష్టం చేశారు. ఒరిస్సా, గుజరాత్‌లో ప్రభుత్వ సంస్థలకు ఇచ్చి ఇక్కడ సింగరేణికి బొగ్గు బ్లాక్స్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సింగరేణి వేలంలో ఎందుకు పాల్గొనాలని నిలదీశారు. ఇక్కడ ఉన్న ఎంపిలు చేత కానివారా? అని కెటిఆర్ మండిపడ్డారు.

సింగ రేణికి బొగ్గు గనులు కేటాయించకుండా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న్ కుట్ర ఇది. రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఎందుకు మాయ మైంది. ముఖ్యమంత్రిగా వేలం పాటలో పాల్గొంటామని చెబుతున్నారు. ఇది దారుణం అని కెటిఆర్ మండిపడ్డారు. కేంద్రం మా మెడ మీద కత్తి పెట్టినా బొగ్గు గనులు వేలం వేయకుండా చూశాం. తొమ్మిదిన్నరేండ్లు సింగరేణిని కాపాడుకున్నాం. సింగరేణి లాభపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది. కార్మికులు లాభపడుతారు. సింగరేణి కార్మికులు జంగ్ సైరన్ ఊదితే దక్షిణ భారతదేశం అంధకారంలోకి వెళ్తుందన్నారు. బొగ్గు గనులను వేలం పెట్టవద్దని నాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారన్నారు. కానీ ఇప్పుడు బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనాలని కిషన్ రెడ్డి చెబితే, రేవంత్ రెడ్డి పాల్గొంటానని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో ఒడిశాలో రెండు గనులను నైవేలీ లిగ్నైట్ కంపెనీకి, గుజరాత్‌లోని గనులను అక్కడి ప్రభుత్వరంగ సంస్థలకు వేలం లేకుండా కేటాయించారని గుర్తు చేశారు. తమిళనాడులోనూ ప్రభుత్వరంగ సంస్థలకు వేలం లేకుండా కేటాయించారన్నారు.

2021, డిసెంబర్ 8న కేంద్రానికి నాటి సిఎం కెసిఆర్ లేఖ
బొగ్గు గనులను వేలం వేయొద్దని 2021, డిసెంబర్ 8న కేంద్రానికి నాటి సిఎం కెసిఆర్ లేఖ రాశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి బొగ్గు గనులను అప్పగించాలని లేఖలో పేర్కొన్నారు. బీహార్‌లోని చెస్నా అనే ప్రాంతంలో ఆనాడు బొగ్గు బావిలో ప్రమాదం జరిగి వందల మంది కార్మికులు చనిపోయారు. నాటి కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులు అన్ని ప్రభుత్వ రంగ సంస్థ్లల కిందనే ఉండాలని, ఉంటేనే రక్షణ చర్యలు తీసుకోవ డానికి అవకాశం ఉంటుందని చెప్పి, 1975-76లో నాటి కేంద్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దానిని ఉటంకిస్తూ కెసిఆర్ లేఖ రాశారు. ప్రస్తుతం సింగరేణిలో 51 శాత రాష్ట్రం వాటా, 49 శాతం కేంద్ర వాటా ఉంది. కాబట్టి సింగరేణికే బొగ్గు గనులు కేటాయించాలని కెసిఆర్ అడిగారు. నాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిసెంబర్ 11, 2021 ప్రధానికి లేఖ రాశారు. నాలుగు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయా లి. వేల మంది వర్కర్లు రోడ్డున పడతారని చెప్పారు. కానీ ఇవాళ బొగ్గు గనుల వేలంలో పాల్గొంటామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చేత చెప్పించారని కెటిఆర్ గుర్తు చేశారు.

ఉద్దేశపూర్వక కుట్ర
మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొగ్గు మంత్రిత్వ శాఖ ద్వారా ఏ టెండర్, వేలం లేకుండా.. ఒడిశాలో రెండు గనులను నైవెల్లి లిగ్నైట్ లిమిటెడ్‌కు అప్పగించారు. గుజరాత్‌లో గుజరాత్ మినరల్ డెవపల్‌మెంట్ కార్పొరేషన్, గుజరాత్ ఇండస్ట్రీ పవర్ లిమిటెడ్‌కు 2015లో నాలుగు బొగ్గు గనులు అప్పజెప్పారు. ఒకవైపు ఒడిశాలో రెండు, గుజరాత్‌లో రెండింటికి ఐదు బొగ్గు గనులు అప్పజెప్పారు. తమిళనాడులోనూ ప్రభుత్వ రంగ సంస్థకు బొగ్గు గనులు వేలం లేకుండా ఇచ్చారు. ఆదానీకి బైలదిల్లా గని కేటాయించడం వల్ల విశాఖ ఉక్కు నష్టాల్లోకి వెళ్లింది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో పోయింది ప్రయివేటీకరణకు అప్పగిస్తున్నామని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సింగరేణి విషయంలో కూడా అదే వైఖరి అవలంబిస్తారు. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర ఇది. రేవంత్‌రెడ్డి వ్యతిరేకత ఎందుకు మాయమైంది. ముఖ్యమంత్రిగా వేలం పాటలో పాల్గొంటామని చెబుతున్నారు. ఇది దారుణం అని కెటిఆర్ మండిపడ్డారు. 16 ఎంపి సీట్లు వస్తే కేంద్రంలో మనం నిర్ణయాత్మకంగా ఉంటామని కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఈరోజు బిఆర్‌ఎస్‌కు లోక్ సభ స్థానాలు వస్తే కేంద్రంలో నిర్ణయాత్మక స్థానంలో ఉండేవారమని మరోమారు కెటిఆర్ పునరుద్ఘాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News